ఆంధ్రప్రదేశ్
డిమాండ్స్ డే సందర్భంగా కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని తహశీల్దార్ కు అంగన్వాడీల వినతిపత్రం

రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం,
జూలై 10వతేదిన సి.ఐ.టి.యు అధ్వర్యంలో దేశవ్యాప్త డిమాండ్స్ డే పిలుపులో భాగంగ కొత్తపేట నియోజకవర్గంలో గల నాలుగు మండలాలలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.
కేంద్రంలో, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, కార్పోరేట్లకు అనుకులంగా పనిచేసాయి. అంగన్వాడి, ఆశా, మధ్యహ్నభోజన పథకం, నేషనల్ హెల్త్ మిషన్, వెలుగు, ఉపాధి హామీ, మెప్మా, సమగ్ర శిక్ష, ఆయూష్ కేంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించగపోగ కనీస వేతనాలు చెల్లించలేదని, భవన నిర్మాణకార్మికుల సంక్షేమపథకాలను నిలిపివేసింది అని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, కంటింజెంట్, పార్టెం, గెస్ట్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయకపోగా నూతన పెన్షన్ స్కీం తీసుకుని వచ్చింది. విశాఖస్టిల్ ప్లాంట్ను ప్రయివేటికరణ చేయుటకు మొగ్గుచుపుతున్నది. ట్రాన్స్పోర్టు కార్మికులకు కంద, కొబ్బరి వోలుపు మరియు దింపు, కార్మికులకు ఎటువంటి సంక్షేమ బోర్డులు తీసుకుని రాలేదు. కావున నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలి అని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తున్నాము. వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నాము.
దేశ వ్యాప్త కార్మికుల డిమాండ్స్..
కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలి అని వినతిపత్రం
1. లేబర్ కోడ్సు వెంటనే రద్దు చేయాలి.
2. ప్రైవేటీ కరణను, జాతీయ నగదు బదిలీ కరణ పథకములను ఆపాలి.
3. అంగన్వాడి, ఆశా, మధ్యహ్నభోజన పథకం, నేషనల్ హెల్త్ మిషన్, వెలుగు, ఉపాధి హామి, మెప్మా, సమగ్ర శిక్ష, అయూష్, శేంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర అన్నిపథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలి.
4. కనీస వేతనాలు నెలకు రూ.26000 చొప్పున నిర్ణయించి అమలు చేయాలి. పెన్షన్ లాంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలి.
5. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పధకాలను తిరిగి ప్రారంభించాలి, ఇప్పటివరకు పెండింగ్ ఉన్న పెండింగ్ క్లయిముల పరిహారాలను తక్షణమే చెల్లించాలి.
6. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కంటింజెంట్, పార్టెం, గెస్ట్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్టరును తొలగించినా కార్మికులకు తొలగించరాదు. అందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. రెగ్యులర్ చెయ్యాలి.
7. పాత పెన్షన్ స్కీమును అమలు చేయాలి. నూతన పెన్షన్ స్కీమును రద్దు చేయాలి.
8. విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్ధ్యంతో నడపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కేంద్ర ప్రభుత్వ చర్యలు చేపట్టాలి.
9. ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు ఉరితాడుగా మారనున్న భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయలి.
10. కంద, కొబ్బరి వలపు & దింపు, ట్రాన్స్పోర్ట్ మరియు ఇతర అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయ్యాలి.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక