ఆరోగ్యం
డయేరియా నివారణ పై తక్షణమే చర్యలు చేపట్టాలి – సి.పి.ఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం
డయేరియా నివారణ పై తక్షణమే చర్యలు చేపట్టాలి.
– సి.పి.ఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు.
జిల్లాలో డయేరియా చాప కింద నీరులా విస్తరించి ప్రజల ప్రాణాలను బలిగొంటుందని , తక్షణమే అధికారులు స్పందించి డయేరియా నివారణ పై తక్షణమే చర్యలు చేపట్టాలని సి.పి. ఎం జిల్లా కార్యదర్శి వంద వాసి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం గూడూరు పట్టణంలోని సి.పి. ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. పట్టణంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గూడూరు పురపాలక పరిధిలోని చెన్నూరు ప్రాంతంలో డయేరియా తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఎంతో బాధాకరం అన్నారు. చెన్నూరు లో పదుల సంఖ్యలో డయేరియా తో ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు అన్నారు. అధికారులు స్పందించిన పాపాన పోలేదు అన్నారు. చెన్నూరు నీ గతంలో ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు దత్తత తీసుకున్నారు అని గుర్తు చేశారు. కానీ చెన్నూరు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.
చెన్నూరు ప్రాంతంలో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయన్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి డయేరియా నివారణ కి చర్యలు చేపట్టి , ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు సి.పి. ఎం సెంట్రల్ శాఖ కార్యదర్శి జోగి శివ కుమార్ , సి. ఐ. టి.యు పట్టణ కార్యదర్శి సురేష్ , సి. ఐ.టి.యు డివిజన్ కార్యదర్శి శ్రీనివాసులు , చెన్నూరు సి.పి.ఎం నాయకులు గుర్రం రమణయ్య, వెంకటప్ప, అర్.శ్రీనివాసులు , తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక