ఆంధ్రప్రదేశ్
నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా చూస్తా ఎంఎల్ఎ బండారు సత్యానందరావు
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట: చైల్డ్ రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ల్యాంప్ స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి సహకారంతో కొత్తపేట రోటరీ క్లబ్ నందు శుక్రవారం ప్రత్యేక ప్రతిభవంతుల కలయిక సంస్థ డైరెక్టర్ బడుగు సుబ్బాయమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభవంతుల హక్కుల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజున దివ్యాంగులకు 6000 పెన్షన్ రెట్టింపు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు దే అని త్వరలోనే నిజమైనా అర్హులకు 15000 వచ్చేలా చేస్తామని ముందు ముందు ఏది అవసరమైన ప్రభుత్వ పరంగా మీకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
లాంప్ డైరెక్టర్ సాల్మన్ పాల్ మాట్లాడుతూ హక్కులనేవి ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్నాయని అయితే వాటిని పొందుకునే విషయంలో దివ్యాంగులు వెనుకబడ్డ రాని కాబట్టి మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తున్నామని అంతేకాకుండా విద్య, ఆరోగ్యము, విషయంలో వారికి ఆర్థికంగా సహాయం అందిస్తున్నామని మరియు ఇలాంటి అవగాహన సదస్సులు పలు జిల్లాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. మరియు స్పెషల్ ఫెసిలిటేటర్ మహిమరావు 2016 దివ్యాంగుల చట్టంలో పొందుపరిచిన 21 రకాలైన దివ్యాంగులు మరియు వారికి ఉన్న హక్కులు, సదరం పింఛన మొబిలిటీ కి సంబంధించిన పరికరాలను ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68069