ఆంధ్రప్రదేశ్
తన తల్లి పద్మావతి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తనయుడు అద్దంకి బుద్ధ చంద్రదేవ్
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
అమ్మను తలుచుకుంటూ సామాజిక సేవ కార్య్రమాలు నిర్వహించిన అద్దంకి బుద్ధచంద్రదేవ్ మరియు వారి కుటుంబ సభ్యులు.
విశ్రాంత ఉపాధ్యాయిని అద్దంకి పద్మావతి శతజయంతిని (28-7-24) పురస్కరించుకుని ఆమె కనిష్ట తనయుడు, ప్రియదర్శినీ బాలవిహార్ కరస్పాండెంట్, అద్దంకి బుద్ధచంద్రదేవ్ కుటుంబసభ్యుల సహకారంతో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా అమ్మకు ఇష్టమైన మొక్కల మధ్య వారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని ఉంచి అంజలి ఘటించారు. దీనికోసం కడియాపులంక నర్సరీ నుండి వివిధ రకాల ఖరీదైన మొక్కలను,కుండీలను ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు.


తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు, కవి, బహుభాషావేత్త కీ॥శే॥అద్దంకి కేశవరావు 1976లో స్థాపించిన ప్రియదర్శినీ బాలవిహార్ లో నర్సరీ నుండి 2వ తరగతి వరకు చదివే సుమారు 150 మంది పిల్లలకు పలకలు,3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే 200 మంది విద్యార్థిని విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ *16,300/-* లతో పంచారు.
ఈ సందర్భంగా ‘ప్రియదర్శినీ’ కాన్వెంట్ లో పనిచేసే సిబ్బందికి ఒక్కొకరికి 1000/- రూపాయల పారితోషకం బహుమతిగా అందజేశారు, ఆటోలలో పిల్లలను తీసుకువచ్చే డ్రైవర్లకు, స్కూలులో కరెంట్ పని చేసేవారికి 500/- రూపాయల చొప్పున *22,000/- నగదును పంచారు.
వాడపాలెం జెడ్పిపి హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పద్మావతి కోడలు గౌరీకృష్ణ తన అత్తగారి శతజయంతిని పురస్కరించుకుని శిక్షా సప్తాహ్ తిథి భోజనానికి అదనంగా పిల్లలందరికీ *5,000/-* రూపాయలతో 500 లడ్డూలు ఏర్పాటుచేసారు. తన అత్త మామలిద్దరూ ఇదేస్కూలు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలుగా ఉన్నప్పుడు 1946 నుండి 1965 వరకు పనిచేసారని వారి పేర్లు అద్దంకి పద్మావతి, అద్దంకి కేశవరావులని ఆమె అన్నారు.
తమ తల్లిదండ్రులు వాడపాలెం, కొత్తపేటలలో దాదాపు 30 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసిన నేపథ్యాన్ని ప్రియదర్శినీ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధ చంద్రదేవ్ తెలియచేశారు.
తల్లి శతజయంతిని పురస్కరించుకుని కొత్తపేట మండల విద్యాశాఖ కార్యాలయంలో *41,800/-* రూపాయలతో ఏ.సీ. ని ఏర్పాటుచేసామన్నారు. మండల విద్యాశాఖాధికారి -1 మట్టపర్తి హరిప్రసాద్ వేరే ప్రాంతంలో ఉన్నందువల్ల ఫోన్ సంభాషణలో వారి అనుమతిని పొందామని అద్దంకి బుద్ధచంద్రదేవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిణి -2 కుంచె లీలావతి, ప్రియదర్శినీ విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య, మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68078