ఆంధ్రప్రదేశ్
అటకెక్కుతున్న సూపర్ సిక్స్ ! హామీలు కేవలం ఓట్ల కోసమేనా ? చిర్ల జగ్గిరెడ్డి కామెంట్

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
సూపర్ సిక్స్ హామీలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి భయమేస్తోంది అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు
ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్ వెళ్ళింది.
7 నెలల పాటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి. చంద్రబాబు 100 కోట్ల రూపాయలు ఖజానా జగన్ కు ఇస్తే, జగన్ 7,000 కోట్ల రూపాయల పైనే ఖజానాలో ఉంచడం జరిగింది అని, రాష్ట్ర గవర్నర్ తో కూడా అప్పుల గురించి అబద్దాలు చెప్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కుతుంది అని, బడ్జెట్ ప్రవేశపెడితే ఏ పథకానికి ఎంత కేటాయించారో చెప్పవలసి వస్తుంది అని బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా నానుస్తున్నారని అన్నారు.
లోకేష్ పథకాల అమలుకు రూట్ మాప్ వేస్తాం అంటున్నారు అని, దేనికి రూట్ మాప్ వేస్తారు. మా హయాంలో అమ్మఒడి ద్వారా 26,067 కోట్ల రూపాయలు, రైతు భరోసా ద్వారా 34,378 కోట్ల రూపాయలు అందించామని,గెలిచి ఇన్ని రోజులైనా మీరు పేరు మార్చిన తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో, రైతులకు ధాన్యం డబ్బులు బాకీ ఎప్పుడు ఇస్తారో, రైతు భరోసా 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో, నిరుద్యోగ భృతి 3,000 ఎప్పుడు ఇస్తారో ఇవన్నీ చెప్పాలని
విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే భయమేస్తోంది అని మొసలి కన్నీరు కారుస్తున్నారని, అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం విజనరీ కిందకే వస్తుందేమో అని ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు అప్పుకు హామీ ఇస్తామని మోసం చేసింది అని,పోలవరం రూపంలో చంద్రబాబు డబ్బు దోచేస్తున్నారని, పోలవరం చంద్రబాబుకు ATM లాంటిది అని సాక్ష్యాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే అన్నారని గుర్తుచేశారు.
ప్రజలను మోసం చేయడం అలవాటు అయిన చంద్రబాబు నాయుడు నైజం అని మరోసారి నిరూపితం చేస్తున్నారని అన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక