ఆంధ్రప్రదేశ్
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం… ప్రముఖ న్యాయవాది ఉందుర్తి సురేష్
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
టిడిపి నియోజకవర్గ సాంస్కృత విభాగం ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది దళిత వాయిస్ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉందుర్తి సురేష్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయమని అన్నారు
ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు ఉప కులాలు అందరికీ అందాలని మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సుమారు 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు పోరాటం చేయడం జరిగిందని తెలిపారు.
2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఎస్సీ ఉపకులాల మధ్య అసమానతలను రూపుమాపేలా రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకలాలకు జనాభా ప్రాతిపదికన సమానంగా అందించేలా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడం జరిగిందని దానిమీద 2004 వ సంవత్సరంలో కొందరు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను కొట్టివేసిందన్నారు. అనంతరం ఎమార్పిస్ వ్యవస్థాపకులు కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును అప్పీలు చేయడం జరిగిందని అన్నారు.
గురువారం సుప్రీంకోర్టు 6:1 తో రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించడం ఇది చారిత్రాత్మక మైన తీర్పు అని రిజర్వేషన్ ఫలాలు అందని ఉపకలాలకు ఈ తీర్పు హర్షణీయమని అన్నారు.ఈ తీర్పు నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధం చేసి అమలు చేయాలని కోరారు.ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగలకు ధన్యవాదాలు తెలియజేశారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68090