ఆంధ్రప్రదేశ్
మందేశ్వరస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజెపీ నేత సోము వీర్రాజు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
మందేశ్వరస్వామివారిని దర్శించుకున్న భాజపా అగ్రనేత సోము. మండలం పరిధిలోని మందపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మందేశ్వర (శనేశ్వర )స్వామివారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు. జాతీయ కార్యవర్గసభ్యులు. మాజీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు శనివారం నాడు దర్శించుకుని అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో వీర్రాజుకు దేవస్థానం అర్చకులు అధికారులు పూలమాలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆశీర్వాచనాలను అందజేసి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి. కె. విజయలక్ష్మి, సూపర్డెంట్ మాచిరెడ్డి వెంకటేశ్వరరావు, రవి లు శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

అనంతరం ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్న సమారాధనను గోశాలను వీర్రాజు పరిశీలించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు దేవస్థానం మాజీ చైర్మన్లు చింతా కృష్ణ,బండారు సూర్యనారాయణమూర్తి స్వాగతం పలికారు. సోము వెంట బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీరగోవిందరావు,సీనియర్ నాయకులు గోనెమడతల కనకరాజు,జిల్లా కార్యవర్గ సభ్యులు సంపతి కనకేశ్వరరావు,నల్లా శ్రీరామ్ ప్రసాద్,తదితరులు ఉన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68090