ఆంధ్రప్రదేశ్
మాజీ భారతదేశ తొలి మహిళా ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా????
కడప జిల్లా ప్రొద్దుటూరు లో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అవమానం జరుగుతోందని అభిమానులు వాపోతున్నారు….. వివరాల్లోకి వెళితే స్థానిక గాంధీ రోడ్డు నుంచి రామేశ్వరం వైపు వెళ్లే సర్కిల్ నందు తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని అప్పటి కాంగ్రెస్ మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో ప్రొద్దుటూరు మాజీ మునిసిపల్ ఛైర్మెన్ వైఎస్ ముక్తియార్ ఏర్పాటు చేశారు…. ఈ విగ్రహాన్ని ఇందిరాగాంధీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై అభిమానంతో నాయకులు ఏర్పాటు చేసినప్పటికీ……………. పక్కనే ఉన్న కాలువపై కనీసం కల్వర్టు కూడా లేదు …మున్సిపాలిటీ వారు ఇందిరాగాంధీ విగ్రహానికి పక్కనే చెత్తబుట్టలు ఏర్పాటు చేశారు… ఇక్కడే చేపలు వ్యాపారస్తులు కూడా చేపల అమ్ముతుడంతో ఒక భారత దేశ మొట్టమొదటి జిల్లా ప్రధానమంత్రి కి మన ప్రొద్దుటూరు మునిసిపాలిటీ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా???? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు…. ఈ మధ్యకాలంలో మాజీముఖ్యమంత్రి వైయస్సార్ కూతురు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రొద్దుటూరు కు విచేసినప్పుడు కూడా కనీసం ఇక్కడ కల్వర్టు కానీ బండలు కానీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ప్రొద్దుటూరు కాంగ్రెస్డ్ పార్టీ ఇంచార్జి నజీర్ ఇందిరమ్మ విగ్రహం చుట్టు అప్పుడప్పుడు పరిశుభ్రం చేయిస్తూ ఉన్నప్పటికీ…. ఈ మధ్యకాలంలో వైసీపీ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా కనీసం ఇందిరాగాంధీ విగ్రహం వైపు చూడకపోవడం… విగ్రహచుట్టుపక్కల పరిశుభ్రత గురించి పట్టించుకోకపోవడంతో ప్రజల్లో విమర్శలు వెలివెత్తుతున్నాయి….కేవలం తన స్వలాభం కోసం మాత్రమే ఇర్ఫాన్ బాషా పార్టీ మారాడని, మొదట పార్టీ తమ నాయకురాలు ఇందిరాగాంధీని పట్టించుకుంటేనే కదా ఈ నాయకులు ప్రజలను పట్టించుకోగలరు అన్న చందంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు….. ఇకనైనా అధికారులు,నాయకులు… స్పందించి ఇందిరా గాంధీ విగ్రహం చుట్టూ కల్వర్టు లేదా బండలు ఏర్పాటు చేసి ఇక్కడి చెత్తబుట్టను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు…
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68078