ఆంధ్రప్రదేశ్
కొత్తపేట లో రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మడలం
స్వాతంత్ర్య సమరయోధుడిగా, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, ఐక్యతకు ఎంతగానో పాటుపడిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు,శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.
గౌతు లచ్చన్న జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో స్థానిక ఆర్.ఎస్ బి.సి కన్వెన్షన్ హాలు వద్ద సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి రెడ్డి సుబ్రహ్మణ్యం,పలువురు బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గౌడ, శెట్టిబలిజ, ఈడిగ,శ్రీశయన, యాత కులస్తులందరూ ఒక్కటేనని, వారందరినీ ఒకే తాటిపై నడిపించేందుకు గౌతు లచ్చన్న ఎంతో కృషి చేశారన్నారు.అంతా కలిసి కట్టుగా రాజ్యాధికారం సాధించాలని ఆయన ఆశించిన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీడీపీ జిల్లా శెట్టిబలిజ సాధికారిక కన్వీనర్ దాసరి వీరవేంకట సత్యనారాయణ,మండల శెట్టిబలిజ సంఘం గౌరవాధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ, అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి గుబ్బల సత్తిపండు,బొంతు గౌరీ శంకర్,గుబ్బల వీర్రాజు, డా.ప్రదీప్,బొక్కా సుబ్రహ్మణ్యం,శీలం కొండబాబు,కడలి భీమా తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక