ఆంధ్రప్రదేశ్
జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కొత్తపేటలో వైద్యుల ధర్నా మహిళ ఉద్యోగులకు భద్రత కల్పించాలి మహిళా డాక్టర్ల ఆవేదన

రిపోర్టర్ : జైదేవ్
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా,
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
కలకత్తాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా కొత్తపేట ఏరియా అసూపత్రిలో వైద్యులు విధులను బహిష్కరించి, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో లేడీ డాక్టర్లకు భద్రత కల్పించాలనీ వినతి పత్రాన్ని అందించారు పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టి నిరశన తెలియజేసి ఆర్డిఓ జీవివి సత్యనారాయణకు మెమోరాండం అందించారు
ప్రభుత్వ ఆసుపత్రిలలో పనిచేస్తున్న డాక్టర్ల రక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్షన్ తీసుకురావాలన్నారు.ప్రతి మెడికల్ కాలేజీల నందు రాత్రిళ్ళు చికిత్స చేసే పీజీ డాక్టర్లకు సిబ్బందికి ప్రత్యేక గదులు కేటాయించాలన్నారు
వైద్య నిపుణులకు,ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీనియర్ డాక్టర్లు,జూనియర్ డాక్టర్లు మరియు వైద్య సిబంది డిమాండ్ చేశారు. బాధితురాలికి,ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత ఏర్పడుతుందని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.
డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణగా పోలీసులను నియమించాలని దోషులను కఠినంగా శిక్షించాలని,ఏ మహిళకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుంది అని వైద్యులు తెలిపారు.
కార్యక్రమంలో కొత్తపేట రావులపాలెం మండలము సంబంధించిన జూనియర్, సీనియర్ ప్రైవేట్ వైద్యులు పాల్గొన్నారు వారితో పాటుగా,ఎ.ఎన్.ఎం.లు,ఆశ వర్కర్లు,పి. హెచ్.సి.లలో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక