ఆంధ్రప్రదేశ్
700 మంది పోలీసులు మోహరింపు.

తిరుపతి జిల్లా…తిరుపతి :ఆగస్టు 18(ఏపీ టు డే న్యూస్)
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన దృష్ట్యా, కార్యక్రమం సజావుగా మరియు విజయవంతమయ్యేలా పోలీసు శాఖ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపిఎస్.,
తిరుపతి:-రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సిటీ పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, కాన్వాయ్ రిహార్సల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర ఐఏఎస్., పాల్గొన్నారు.
హెలిపాడ్, శంకుస్థాపన చేయు ప్రదేశాల వద్ద పటిష్టమైన బ్యారికేడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు సూచించారు.
సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్ లను పరిశీలించి, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ, వైద్యులు, వైద్య సామాగ్రి అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను కోరారు.
రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నామని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు అయన తెలిపారు..
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు. కులశేఖర్ శాంతి భద్రతలు, రాజేంద్ర సెబ్, ఏ ఆర్ శ్రీనివాసులు,డీఎస్పీ లు,ఐ.ఎస్.డబ్ల్యు అధికారులు, శ్రీ సిటీ ఎండి, ఆర్డిఓ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జె అనిల్‌కుమార్
ఏపీ టు డే న్యూస్
కరస్పాండెంట్ తిరుమల.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక