ఆంధ్రప్రదేశ్
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
రిపోర్టర్ : జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం

గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్య సాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో వికాస సారధ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
నేటి జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేయడం, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మొదలుకొని ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్,పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభ పరిణామం అని వ్యాఖ్యానించారు. హెచ్సీఎల్, టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమని ఆయన అన్నారు.
ప్రైవేట్ సెక్టార్లో అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నా, వాటిపై పట్టణ యువతకు ఉన్నంత అవగాహన, గ్రామీణ యువతకు లేకపోవడంతో వారు వెనకబడుతున్నారని, ఇటువంటి వారికి జాబ్ మేళాలు అక్కరకొస్తాయన్నారు.
చదువుకున్న యువతకు సరైన అవకాశాలు లభించినప్పుడే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన కళాశాలలో చదువుకున్న యువతకు తమ,తమ సామర్థ్యాల గణనకు ఈ జాబ్ మేళాలు దిశా నిర్దేశం చేస్తాయని, ఆరు నెలలకు ఒకసారైనా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉండడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమం లో రెవెన్యూ డెవిషనల్ అధికారి జి వి వి సత్యనారాయణ,వికాస ఎం డి లచ్చరావు, రమేష్, గ్లోసరీ సాఫ్ట్ టెక్ ఎం డి లలిత,బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ,కె వి సత్యనారాయణ రెడ్డి,గుత్తుల పట్టాభి,కంఠంశెట్టి శ్రీనివాస్, ముదునూరి వెంకటరాజు,చిలువూరి సతీష్ రాజు,కరుటూరి నరసింహారావు,ధరణాల రామకృష్ణ, ఈదాల సత్తిబాబు,జక్కంపూడి వెంకటస్వామి, మైగపుల గురయ్య,రెడ్డి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67952