ఆంధ్రప్రదేశ్
పి. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లను రాంబందులు లా పీక్కుతింటున్న సెక్యూరిటీ సిబ్బంది
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి గన్నవరం నియోజకవర్గం
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయవలసిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే పేషెంట్ల దగ్గర డెలివరీ పేషెంట్ వద్ద పి గన్నవరం 100 పడకల ఆసుపత్రిలో వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.
ఇది లంచమా ? అంటే కాదు మీకు సేవ చేస్తున్నందుకు ఇవ్వాలి అంటూనే లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు లభించే సౌకర్యాలు ఉండవు అని డైరెక్ట్ గా చెప్తున్నారు!
ప్రైవేట్ ఆస్పత్రులలో లక్ష లక్షలు పిజు లు ఇస్తారు కానీ మేము ఇక్కడ అడిగితే కొద్దిపాటి డబ్బులు ఇవ్వ లేరా? అని బెదిరిస్తున్నారు !
డబ్బులు ఇవ్వని డెలివరీ పేషంట్లు ను కలవడానికి వచ్చిన బంధువులను సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్ రూల్స్ పేరుతో పేషెంట్లకు వాలంటీర్ గా ఉన్నవారికి కనీస భోజనాలను ఇవ్వ నివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
మాకు రూల్స్ ఉంటాయి ఎప్పుడు బడితే అప్పుడు కలవడానికి ఇది మీ ఇల్లు కాదు అంటూ వారిపై విరుచుకు పడడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఎవరైనా పేషెంట్లు డబ్బులు అందుబాటులో లేక రేపు ఇస్తాము అంటే అలా కుదరదు రేపు వేరే సిబ్బంది వస్తాది మేము రావడానికి ఉండదు కాబట్టి తక్షణమే ఇవ్వండి అని బాధిస్తున్నారు .
లేకుంటే ఫోన్ పే, గూగుల్ పే, చేయండి అని ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. ఈ రకంగా చూస్తుంటే వారికి వచ్చే జీతాలతో పోలిస్తే పక్కదారి నుంచి వచ్చే ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువ అని ప్రజలు చెప్పుకుంటున్నారు.
రోజు వారీ వచ్చిన మొత్తంలో కొంతమంది కలిసి పంచుకోవడం గమనార్ధం!ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే మీరు ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం ఉండదు, ఇక్కడ మీము చెప్పిందే వేదం అంటున్నారు.
మాకు నాలుగు నెలల నుండి జీతాలు రావడం లేదు ! మేము ఏమి చేయాలి అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు మేము ఎందుకు ఇవ్వాలి అని అడిగితే ఇవ్వాల్సిందే అంటూ ఎదురు తిరిగి గొడవపడుతున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68063