ఆంధ్రప్రదేశ్
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట
తంబళ్లపల్లి నియోజకవర్గం
బి కొత్తకోట మండలం
బీరంగి గ్రామ
గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం…..

ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభలలో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం బీరంగి గ్రామ సమావేశం నందు పాల్గొన్న రాష్ట్ర తదేపా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిధులు విధులు లేకుండా నిర్వీర్యం చేసిందని గ్రామాలలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందని ప్రస్తుత ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి అభివృద్ధిని సంక్షేమాన్ని పెంపొందించి తద్వారా ప్రజలకు మంచి చేయాలని ఈరోజు గ్రామాలలోని ప్రజల వద్దకు అధికారులను పంపి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాటి ద్వారా ఎటువంటి లబ్ధి చెందవచ్చు ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం పై అవగాహన కోసం, మరియు గ్రామాలలో కావలసిన మౌలిక వసతులు రోడ్లు, మురికి నీటి కాలువలు, వీధిదీపాలు సమస్యల పరిష్కారానికి ఈ గ్రామ సభలు దోహదపడతాయని అన్నారు
మండల పార్టీ అధ్యక్షులు నారాయణస్వామి రెడ్డి గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రజలకు ఎంతో మంచి చేకూరుతుందని అధికారులు చెప్పిన విషయాలు సావధానంగా విని మన ప్రాంతంలో అవసరమైన వాటికి ప్రతిపాదనలు ఇవ్వాలని గ్రామస్తులను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ఈవోపీఆర్డీ , పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ వెంకటరమణ, వీఆర్వో, ఐసిడిఎస్ సూపర్వైజర్, సచివాలయ సిబ్బంది, ఆనంద గోపీనాథ్ సురేష్ వెంకటేష్ గాజుల సురేష్ చౌడప్ప శ్రీరాములు సుబ్బన్న నరసింహులు వెంకటపతి ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67893