ఆంధ్రప్రదేశ్
దొంగను పట్టించిన సిబ్బందికి మేయర్ అభినందనలు
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ

23వ వార్డు శ్రీరామ్ నగర్ క్వార్టర్స్ నందు దొంగను పట్టించిన మున్సిపల్ సిబ్బందిని నగర మేయర్ బి.వై. రామయ్య అభినందించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో శానిటేషన్ సెక్రటరీ ఏంజల్ ప్రణీత, మేస్త్రి సురేష్, కార్మికురాలు శిరీషలను మేయర్ సత్కరించారు. ఈ నెల 22వ తేదీన శ్రీరామ్ నగర్ క్వార్టర్స్ నందు ఒంటరిగా నివాసముంటున్న ఓ మహిళ ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్ తస్కరించి పారిపోతుండగా, మున్సిపల్ సిబ్బంది వెంబడించి, చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు పట్టించారు. వారిని మంగళవారం మేయర్‌తో స్థానిక కార్పొరేటర్ కటారి పల్లవి అభినందించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, కార్పొరేటర్లు విక్రమసింహా రెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, స్థానిక వార్డు నాయకులు కటారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68097