ఆంధ్రప్రదేశ్
అప్పులు చేయడంలో ముందుకు దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం -కాంగ్రెస్ పార్టీ సీనియర్ తులసి రెడ్డి
కడప జిల్లా
ప్రొద్దుటూరు
అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం జగన్ పాలనను మించిపోయిందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు నర్రెడ్డి తులసి రెడ్డి పేర్కొన్నారు బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
జగన్ ప్రభుత్వం శక్తికి మించి అప్పు చేసిందని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని టిడిపి జనసేన నాయకులు విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అంతకంట ఎక్కువగా అప్పులు చేస్తోందని, ఈ రెండున్నర నెలల్లో 15 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఈ సంవత్సరం జూన్ 25న 2000 కోట్ల రూపాయలు జులై రెండున ఐదువేల కోట్ల రూపాయలు జూలై 16న 2000 కోట్ల రూపాయలు జూలై 30న 3000 కోట్ల రూపాయలు ఆగస్టు 27న 3 వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల రూపంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసిందని విమర్శించారు.
దీనికి తోడు రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వద్ద 15 వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించడం శోచనీయమన్నారు. ఇకనైనా శక్తికి మించి అప్పు చేయటం మానుకోవాలని సూచించారు. టిడిపి కూటమి పాలనలో రాష్ట్రం అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారైందని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో డమేరియా రోగులతో కిటకిటలాడేవి. ప్రస్తుతం మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా తదితర విషజ్వరాల రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయని,
మలేరియా కేసుల నమోదు 2022లో 1237, 2023లో 3840 కాగా 2024 ఆగస్టు 25వ నాటికి 4610 నమోదయ్యాయని వివరించారు. డెంగ్యూ కేసులు 2022లో 2174, 2023లో 3252 నమోదు కాక 2024 ఆగస్టు 25 నాటికి 2955 నమోదయ్యాయని,
చికెన్ గున్యా కేసులు 2022లో 16, 2023లో 5 నమోదు కాగా 2024 ఆగస్టు 25 నాటికి 99 కావడం గమనార్హమన్నారు. రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని, పర్యవసానంగా రోగాలు ప్రబులుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా పారిశుధ్యం పైన ప్రజారోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు జిలాని భాష, నాయకులు రామాంజనేయులు, రషీద్, ఖలందర్, ఖాజా, అలీ, గయాజ్, అమర్, ఉత్తన్న, సుబ్బరాయుడు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67957