ఆంధ్రప్రదేశ్
అవినీతిని నిర్ములనకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పు శూన్యం

ఏపీ టుడే న్యూస్ బ్యూరో , కర్నూల్ సిటీ
ప్రతి డాక్యుమెంటుకు సి.ఎస్.చేయడానికి రూ.200 డిమాండ్
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్ములించడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్ట సవరణలు చేస్తున్న అవినీతిని నిరోదించలేక పోతున్నాయి.కొన్ని కార్యాలయాల్లో అవినీతి తగ్గినట్లు కనిపించిన,సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో మాత్రం మార్పులు రావడం లేదు.ప్రతి పనికి లంచం లేనిదే పనులు చేయడంలేదు.ఈ నేపథ్యంలోనే
కర్నూలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం అవినీతికి అడ్డుకట్ట లేకపోతోంది అని లబ్ధిదారులు బహిరంగంగ ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో
రాఘవేంద్ర అనే సీనియర్ అసిస్టెంట్ ప్రతి డాక్యుమెంటుకు సి.ఎస్.నంబర్ చేయడానికి రూ.200 డిమాండ్ చేస్తున్నాడని…ఇవ్వని పక్షంలో ప్రజలకు,దస్తావేజు లేఖర్లకు చుక్కలు చూపిస్తున్నాడని ఆవేదన చెందుతున్నారు.అదేవిదంగా కల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ.సిలను సిటిజన్ ప్రకారం ఇవ్వకుండా డిలే ప్రాసెస్ క్రింద చేస్తూ,అత్యవసరం ఉన్నా వారికి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెపుతున్నారు.ఈ నెల 23వ తేదీ నుండి పెండింగ్ లోనే ఉన్నాయి.ఈ కార్యాలయంలో అనిత సీనియర్ అసిస్టెంట్ ఒక చిన్న కౌంటర్ ఏర్పాటు చేసుకొని వసూలు చేస్తున్నందున లబ్ధిదారుల ఇబ్బందులు వర్ణనాతీతం అని వాపోతున్నారు.ఈ అధికారిపై గతంలో పలు ఆరోపణలు ఉన్నను చలించని దుస్థితి ఉందని ఆరోపిస్తున్నారు.గతంలో జిల్లా అధికారి ఈ అధికారికి మెమో ఇచ్చిన ఫలితం లేదని పేర్కొంటున్నారు.కావున రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని,ఈ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని నిరోధించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక