ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన బొజ్జా దశరథరామిరెడ్డి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధుల కేటాయింపులు సాధించడంపై హర్షం.
అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక నిధులను రాబట్టాలి.
శిథిలావస్థలో ఉన్న రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణ చేపట్డాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడకుండా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధుల కేటాయింపులు సాధించడంపై క్రియాశీలకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అభినందనలు తెలిపారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధుల కేటాయింపులు సాధించిన సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ది, రాయలసీమ సాగునీటిరంగ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి దశరథరామిరెడ్డి లేఖ వ్రాసారు.
ఈ సందర్భంగా శనివారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ
రాష్ట్ర సమగ్రాభివృద్దిపై మీ క్రియాశీల కార్యాచరణ వలననే కేంద్రం నుంచి నిధుల సమీకరణలో విజయం సాధించారు. అదే స్పూర్తితో శిథిలావస్థకు చేరిన రాయలసీమ సాగునీటి రంగాన్ని ముఖ్యమంత్రి గాడిన పెడతారన్న ఆశాభావాన్ని రాయలసీమ సమాజం ఆశిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో కేవలం 15 శాతం నిధులే గత 10 సంవత్సరాలుగా ఖర్చు చేయడంతో నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నోచుకోకపోవడంతో సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా రాయలసీమలో పంటల సాగు “దినదిన గండం నూరేళ్ళ ఆయస్సు” లాగా కొనసాగుతున్నదనీ, దీనివలన రాయలసీమ సమాజం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో 42 శాతం నిధులు రాయలసీమకు కేటాయించడం
2. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన వెనుకబడిన జిల్లాల బుందేల్ కండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే సాధించడం.
3.అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటుగా రాయలసీమ సమానాభివృద్ధి సాధించడానికి, కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే ప్రధాన మంత్రి క్రిషి సించాయ్ యోజన నిధులను, రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్ఫస్ వెహికల్ ద్వారా నిధులను, గ్రాంట్ లను సాధించడం.
4. రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువుల పరిరక్షణ, నిర్మాణం, వాటిని వాగులు, వంకలు, నదులు, కాలువలతో అనుసంధానం చేపట్టడం. దీనితో పాటు పెన్నా నది పునరుజ్జీవనం, సామాజిక అటవీ అభివృద్ధి, పర్యవరణ పరిరక్షణను చేపట్టడం. ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలకు ప్రత్యేక సాంప్రదాయ వనరుల, పర్యావరణ పరిరక్షణ మిషన్ ను ఏర్పాటు చెయ్యడం లాంటి అంశాలపై క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకుని, తద్వారా రాయలసీమకు ముఖ్యమంత్రి అండగా వుండాలని రాయలసీమ సమాజం ఆశిస్తున్నదని తెలిపారు.
అన్ని రకాల వాణిజ్య, ఉద్యానవన పంటలు పండించే, విత్తనోత్పత్తి చేయగలిగే అన్ని వనురులు కలిగి, రాష్ట్రంలో 42 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న రాయలసీమలో సంపద సృష్టికి దోహదపడే పై కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని లేఖలో ముఖ్యమంత్రికి బొజ్జా విజ్ఞప్తి చేసారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68130