Connect with us

తెలంగాణ

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అందరూ అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published

on

హైదరాబాద్:

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు , ఉన్నతస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించారు.

🔹 ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశించారు.

🔹 అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమయంలో అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, ఇప్పటికే సెలవుపై ఉన్నవారు వెంటనే విధుల్లో చేరి సహాయక పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు.

🔹 అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని సీఎం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

🔹 అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ప్రజలందరికీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

🔹 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని పార్టీ కార్యకర్తలనూ ముఖ్యమంత్రి ఆదేశించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580183
Total Users : 47867