ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన టిటిడి EO

తిరుపతి జిల్లా :
తిరుమల: సెప్టెంబర్ 4 (ఏపీ టు డే న్యూస్)
తిరుమల 30 ఆగస్టు 2024: తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులను టిటిడి ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడసేవకు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇందులో భాగంగా, జిల్లా పోలీసులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి, వివిధ గ్యాలరీల్లోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను, గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం, తదితర భద్రతా అంశాలు పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి మరియు వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ, అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. టిటిడి నిఘ మరియు భద్రత విభాగము, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మ రథాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 సత్యనారాయణ, డిప్యూటీ ఈవో హెల్త్ ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూధన్ ప్రసాద్, విజిఓలు సురేంద్ర, శ రామ్‌కుమార్, ఇతర అధికారులు.
జె అనిల్‌కుమార్
ఏపీ టు డే న్యూస్
కరస్పాండెంట్ తిరుమల.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక