ఆంధ్రప్రదేశ్
సెయింట్ ప్యాట్రిక్స్ అకాడమీలో ఘనంగా జరిగిన గురుపూజోత్సవం

రిపోర్టర్: జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం మండలం
రావులపాలెం సెయింట్ ప్యాట్రిక్స్ అకాడమీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అకాడమీ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ మను మాథ్యూ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగాయి. అకాడమీ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ మను మాథ్యూ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దగల వ్యక్తి ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమేనని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. అకాడమీ కమ్యూనిటీ లీడర్ రెవరెండ్ బ్రదర్ ఫెలెక్స్అరుణ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు సమాజంలో ఎటువంటి ఉన్నత వ్యక్తినైనా తయారు చేయగలడు కానీ ఎంత ఉన్నత వ్యక్తి అయినా ఒక ఉపాధ్యాయుడిని తయారు చేయలేడు కాబట్టి ఉపాధ్యాయులైన మీరు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు ఉపాధ్యాయులను పూలమాలలతో ఎంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక