ఆంధ్రప్రదేశ్
హజ్ యాత్ర -2025 కు దరఖాస్తు గడువు పెంపు.

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువు ను ను ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదట ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభించి చివరి తేదీ సెప్టెంబర్ 9వ తేదీ వరకు నిర్ణయించిందని, ప్రస్తుతం గడువు పొడిగించినట్లు తెలిపారు.
హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్రహజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు . ప్రతి యాత్రికుడు తన మెషిన్ రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ హజ్ దరఖాస్తు ముగింపు తేదీకి ముందే జారీ చేయబడి ఉండాలని, 15-01-2026 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని తెలిపారు. వయస్సు వయో పరిమితి లేదని,అయితే శిశువుల ప్రయాణం ఉచితం కాదని,పూర్తి విమాన ఛార్జీలో 10% వసూలు చేయబడుతుందని పేర్కొన్నారు.
2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారుకు వయోజన యాత్రికుడుగా ఛార్జీ విధించబడుతుందన్నారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియాద్వారా హజ్‌కు అర్హత జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపారు.మెహ్రమ్ లేకుండా కేటగిరీలో, 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల స్త్రీలు 4 లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళల సమూహాలలో ప్రయాణించడానికి నిబంధనల ప్రకారం అనుమతించబడతారని తెలిపారు. హజ్-2025కు
ఎంపికైన హజ్ యాత్రికులు మెడికల్ స్క్రీనింగ్ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు అంతేకాకుండా, యాత్రికులు ఎంబార్కేషన్ పాయింట్‌కి ప్రాధాన్యతా క్రమంలో రెండు ప్రాధాన్యతలను ఇవ్వాలని మరియు యాత్రికుల బస వ్యవధి 40-45 రోజుల వరకు ఉండవచ్చునని తెలిపారు. హజ్ యాత్ర -2025లో ఒక యూనిట్ కు కనీసం ఒకరు,గరిష్టంగా ఐదుగురు పెద్దలు, ఇద్దరు శిశువులు ఉండవచ్చని తెలిపారు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2024 నుండి ప్రత్యేక ‘హజ్ సువిధ’ యాప్‌ను ప్రారంభించిందని తెలిపారు.దరఖాస్తుల పరిశీలనను, యాత్రకు సంబంధించి ఇతర వివరాలను తెలియజేయడం,యాత్రకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పన విషయాలు తెలియపరిచేందుకు సులభతరం చేయడం కోసం భారతీయ హజ్ చేపట్టిన చర్యలతో యాత్రికులకు ఎక్కువ సౌలభ్యం,సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.సమాచార సాంకేతికతను ఉపయోగించాలనే లక్ష్యంతో ఆన్లైన్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారులు హజ్ కమిటీ సైట్ www.hajcommittee.gov.in / www.apstatehajcommittee.comలో ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి మరియు O/o A.P. రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా సహాయాన్ని, వ్యక్తిగతంగా లేదా టోల్ ఫ్రీ నెం.1800-4257873, 0866- 2471786 లేదా మెయిల్ ద్వారా:aphajcommittee@gmail.com.పొందవచ్చునని తెలిపారు.రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పొడిగించిన నిర్ణీత గడువు ప్రకారం ఈనెల 23వ తేదీ లోపు సమయానికి హజ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ విజ్ఞప్తి చేశారు.ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎమ్ డి ఫరూక్ కోరారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక