ఆంధ్రప్రదేశ్
సాంకేతికత సమాజ హితం కోరాలి.

నంద్యాల జిల్లా
పాణ్యం
ఏపీ టుడే న్యూస్
పాణ్యం సదస్సులో మాట్లాడుతున్న ఆర్జీఎం కళాశాల ఎండి శివరాం
సాంకేతిక విద్య సమాజ హితం కోరాలని ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కళాశాల ఎండి మిద్దె శివరాం పేర్కొన్నారు. మంగళవారం సి ఎస్ ఈ డి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గూగుల్ డెవలప్ గ్రూప్స్ కోడ్ కాంటెస్ట్ సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూగుల్ డెవలపర్స్ గ్రూప్ కు ఆర్ జిఎం సిఎస్ఈ విద్యార్థిని సాయి లక్ష్మి ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. నేటి సాంకేతిక విద్యార్థులు కొత్త విధానాలు కనిపెట్టడంలో నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పాత పద్ధతులే కొనసాగించడం పై విచారం వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితం కనిపెట్టిన కొత్త ప్రయోగాలను మరింత మెరుగుపరచడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు కృషి చేయాలన్నారు.విద్యార్థుల కొత్త కొత్త ప్రయోగాలు గూగుల్ ద్వారా ప్రపంచానికి తెలియజేయడంలో డెవలపర్ గ్రూప్స్ ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యంతో ప్రస్తుత సాంకేతిక విధానాలకు మరింత మెరుగులు దిద్దాలని కోరారు.నాణ్యతలేని విద్య సమాజానికి పనికిరాదన్నారు. కళాశాల నుంచి బయటికి వెళ్లిన విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ప్రయోగాలకు నాంది పలకాలన్నారు.కరోనా తో సాంకేతికత మరింత పెరిగింది అన్నారు. ఇంజనీరింగ్ కు తగ్గ పని చేయడం లేదన్నారు.నేటి సమాజానికి అనువైన ఉత్పత్తులు కనుగొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్,డీన్ డాక్టర్ రామిరెడ్డి, హెచ్ ఓ డి భాస్కరరావు, పారిశ్రామిక నిపుణులు డాక్టర్ మధు కుమార్ శ్రీనివాస్,అష్ప షేక్,వంశీ నందన్,విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక