Connect with us

Uncategorized

స్టాఫ్ నర్స్ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Published

on

స్టాఫ్ నర్స్ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

మంజుల దేవి,ఎపి ప్రభుత్వ స్టాఫ్ నర్స్ అసోసియేషన్

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో స్టాఫ్ నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని స్టాఫ్ నర్స్ మంజుల డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు మెడికల్ కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వ వైద్యశాలలో 25సంవత్సరాలనుండి స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఎపి ప్రభుత్వ స్టాఫ్ నర్స్ అసోసియేషన్ 2008వ సంవత్సరంలో ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. ఆ సందర్బంగా జరిగిన ఎన్నికల్లో బూతం భాగ్యలక్ష్మి అధ్యక్షురాలుగా ఎంపికైనట్లు పేర్కొన్నారు.ఆమె 10సంవత్సరాలపాటు కొనసాగిందని చెప్పారు.అయితే తరువాత కాలంలో అసోసియేషన్ సభ్యులు ఎపిఎన్ జిఓ వైపు కొంతమంది, ఎపిజిఈఎ వైపు కొంతమంది, వ్యక్తిగతంగా కొంతమంది చీలికజరిగినట్లు చెప్పారు.దీంతో అసోసియేషన్ ద్వారా నర్స్ ల సమస్యలు స్వంతంగా పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. 2019 నుండి 2024 వరకు ఎన్నికలు జరుపకుండా ఎపిఎన్ జిఓ, వ్యక్తిగతంగా ఉన్న కొందరు గ్రూప్ లు ఏర్పాటుచేసుకొని కుట్రలు చేస్తున్నట్లు మండిపడ్డారు.ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను ఎన్నికల జరపాలని సంప్రదించిన సందర్బంగా ఎన్నికలు జరుపకుండా అధికారులను సైతం భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.దీంతో ఇది సరైందికాదని ప్రశ్నించిన తనకు వారి నుండి ప్రాణహాని ఉందని ఆవేదన చెందారు.గతంలో ఒకసారి ఎన్నికలు జరపకుండ వ్యక్తిగతంగా ఉన్న ప్యానల్ ను ఏర్పాటుచేసుకొని ఎం.ఎస్.నిర్మల అనే ఆమె ఏకగ్రీవంగా ఎన్నుకుని పదవీ బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరపాలని కోరడంతో తనను సోషల్ మీడియా వేదికగా అవమానకరమైన సమాచారంను పంపుతూ ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుంది అని అన్నారు.ఈ సమస్యపై స్టాఫ్ నర్స్ ఎన్నికలు సజావుగా జరిపించి, ప్రజాస్వామ్యంను కాపాడాలని మంజులదేవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580148
Total Users : 47832