ఆంధ్రప్రదేశ్
పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో

• నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
• రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్‌ఓలతో వేర్వేరు సమావేశాలు
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు. బుధవారం నగరపాలక కౌన్సిల్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బిఎల్‌ఓలతో కమిషనర్, ఎమ్మార్వో వెంకటలక్ష్మి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. మొదట రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించారు. ఏవైనా మార్పుచేర్పులపై చర్చించారు. అనంతం బిఎల్‌ఓతో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతీ ఒక్కరిని నూతన ఓటరుగా నమోదు చేయడానికి ఇంటింటి సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఫారం 6, ఫారం 6 ఏ, ఫారం 7, ఫారం 8, ఫారం 13, ఫారం 14 దరఖాస్తులను త్వరితగతిన పరిశీలన చేయాలని సూచించారు. నూతన ఓటరు నమోదు, ఓటరు చిరునామాలో మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాలు మార్పునకు సంబంధించి ధరకాస్తులు స్వీకరించలన్నారు. ప్రక్రియ అంతా గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఓ జూనైద్, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67955