ఆంధ్రప్రదేశ్
పట్టణములో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముట్టడి. సిపిఐ.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

నంద్యాల పట్టణములు నెలకొన్న సమస్యలపై సిపిఐ పార్టీ నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి ముట్టడించారు. కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి కే ప్రసాద్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు, సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పాల్గొని మునిసిపల్ సీనియర్ అసిస్టెంట్ అధికారి నీ పట్టణ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు . అనంతరం రామాంజనేయులు , రంగ నాయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ని 42 వార్డులలో అనేక సమస్యలు తాండవిస్తున్నవి తెలిపారు.
పట్టణములో వీధి కుక్కలు, పిచ్చికుక్కలు పట్టణంలో పిల్లలను మహిళలను వృద్ధులను విచక్షణారహితంగా కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న మున్సిపల్ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు.
పట్టణంలోని 42 వార్డులలో దోమల నివారణ చర్యలు చేపట్టడంలో మునిసిపల్ అధికారులు గోరంగా విఫలం కావడం జరిగిందని తెలిపారు.
పట్టణ శివారు ప్రాంతాలైన నందమూరి నగర్ వైయస్సార్ నగర్ లో ఇప్పటికీ అక్కడ ఏమాత్రం మౌలిక వసతులు లేవు వర్షాకాలం వచ్చిందంటే చిన్నపాటి వర్షానికి రహదారులలో బురద, తేళ్లు, విష పురుగుల తో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు .
పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు అనేకమంది ఉన్నారని, వారికి టిడ్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించి ఆ గృహాలను కేటాయించాలని అన్నారు .
పట్టణంలోని బయటిపేట, అరుంధతి నగర్ (హరిజన పేట), నడగడ్డ, నబినగర్, తదితర కుందు నది పరివాహప్రాంతాలలో నివసిస్తున్న వారికి, కుందు పరిరక్షణ గోడ త్వరగా పూర్తిచేయాలని అన్నారు.
అదేవిధంగా పట్టణంలోని అనేక ప్రాంతాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిపైన కూడా మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని అన్నారు .
మున్సిపల్ అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టకపోతే మున్సిపల్ కార్యాలయంలో జరుగు కౌన్సిల్ సమావేశాన్ని _భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ_ పట్టణ సమితిగా అడ్డుకుంటామని హెచ్చరించారు .
ఈ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ నాగరాముడు, ధనుంజయ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, అధ్యక్షులు భూమని శ్రీనివాసులు, బేతంచర్ల సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్, గోస్పాడు సిపిఐ మండల కార్యదర్శి హరినాథ్, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, సిపిఐ గోస్పాడు మండల నాయకులు జిలాని, గోకారి, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్దు, పట్టణ సిపిఐ ఏఐటీయూసీ నాయకులు మహిళా సంఘం నాయకులు సుశీలమ్మ, మున్ని, సత్యనారాయణ, సుబ్బరాయుడు, హుస్సేన్సా, సాల మద్దిలేటి, మద్దయ్య, కిట్టు, దానం, ఖలీల్, చాంద్ బాషా, కలాం భాష తో పాటు 15 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68069