ఆంధ్రప్రదేశ్
తాసిల్దార్ రమేష్ బాబు పైచర్యలు తీసుకోండి…
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
తాసిల్దార్ రమేష్ బాబు పైచర్యలు తీసుకోండి… హైకోర్టు
— కోర్టులో ఉన్న ఒకరిపై ఉన్న ఆన్లైన్ తీసేసి మరొకరిపై ఆన్లైన్ చేసిన తాసిల్దార్ రమేష్ బాబు…
— రమేష్ బాబు పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని కోర్టు
తాసిల్దార్ రమేష్ బాబు పై విచారణ చేపట్టి, కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కర్నూలు కోర్టులో వేణుగోపాల్, కిషోర్లు సర్వేనెంబర్ 332/ A1B1 , 93 సెంట్ల స్థలం విషయంలో ఫీల్ వేశారు. అయితే గత నెలలో కర్నూలు రూరల్ తాసిల్దార్ రమేష్ బాబు బదిలీపై వచ్చిన వెంటనే కాసులకు కక్కుర్తి పడి కోర్టులో ఉన్న ఆ 93సెంట్లు స్థలాన్ని మంగలి రాము కు ఆన్లైన్ చేశాడు. దీంతో బాధితులు వేణుగోపాల్, కిషోర్లు హైకోర్టు ఆశ్రయించారు. వివరాలను పరిశీలించిన హైకోర్టు కింది కోర్టులో కేసు నడుస్తున్న లెక్కచేయకుండా కోర్టును ధిక్కరించి ఒకరిపై ఉన్న ఆన్లైన్ తొలగించి మరొకరికి ఆన్లైన్ చేయడాన్ని తప్పుబడుతూ కర్నూలు రూరల్ తాసిల్దార్ రమేష్ బాబు పై చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఆర్డిఓ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాగే వేణుగోపాల్ కిషోర్లకు సంబంధించిన అక్రమంగా ఆన్లైన్ చేసుకున్న మంగలి రాజు పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లా కోర్టులో కేసు నడుస్తున్న ఆన్లైన్ చేయడం చట్ట విరుద్ధమని కోర్టు ఆక్షేపించింది. ఇటువంటి తాసిల్దార్ పై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది.
తాసిల్దార్ రమేష్ బాబు పలు పై ఆరోపణలు….
గతంలో కల్లూరు తాసిల్దార్ గా పనిచేసిన రమేష్ బాబు పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలను అప్పనంగా కొందరికి కట్టపెట్టాడని, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాడని పలువురు ఆరోపిస్తున్నారు. కల్లూరు మండలం లో పనిచేసిన ఈయనపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఒకరి స్థలాన్ని మరొకరికి చేయడం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను డబ్బు కోసం ఆన్లైన్ చేయడం, పాత డేట్లు వేసి పట్టాలి ఇవ్వడం వంటివి అనేకం చేశాడని గతంలో ఆయనపై ఫిర్యాదులు చేశారు. గత వైసిపి ప్రభుత్వం లో వైసిపి అనుకూలంగా వ్యవహరించాడని, వారికి ప్రభుత్వ స్థలాలను అక్రమంగా దోచిపెట్టడని తాసిల్దార్ రమేష్ బాబు పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై డిపార్ట్మెంట్ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు వేణుగోపాల్, కిషోర్ లు కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక