Connect with us

తెలంగాణ

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు

Published

on

Hyderabad;

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

➡️ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు.

➡️రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.

➡️అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేస్తారు.

➡️ఇందుకోసం 3 నుంచి 5 వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ప్రతిపక్షాలు దీనిపై ఎవైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలి.

➡️కుటుంబంలో సభ్యులు పెరిగినందున ప్రజలంతా కుటుంబ డిజిటల్ కార్డు కోసం వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందులో అవసరమైన మార్పుచేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు.

➡️ఒక్క క్లిక్ తో కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనతో ఈ విధానం తీసుకొచ్చాం.

➡️ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుంది.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ , ఎమ్మెల్యే శ్రీగణేశ్ , మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580180
Total Users : 47864