ఆంధ్రప్రదేశ్
తమ్ముడిని హత్య చేసిన అన్న.

తమ్ముడిని హత్య చేసిన అన్న.
నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ :
రుద్రవరం మండలంలోని బి నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కర్రెన్న అలియాస్ ఇసాక్ ( 40) ను అతని అన్న ఓబులేసు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సిరివెళ్ల సిఐ వంశీధర్, ఎస్సై వరప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు తెలిపిన వివరాల మేరకు బి నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మృతుని అన్న ఓబులేసు అనే వ్యక్తి తాగుడుకు బానిసై అదే గ్రామానికి చెందిన సురేంద్ర అనే వ్యక్తిని మోటార్ సైకిల్ రోడ్డుపై వెళుతుండగా అడ్డుకొని మోటార్ సైకిల్ ను వేగంగా నడుపుతున్నావు అని అతనిపై దాడి చేసి గాయపరిచారన్నారు. ఈ విషయంపై ఓబులేసు తండ్రి నడిపి ఓబన్న(దుబ్బన్న) ఓబులేసును మందలిస్తుండగా అతనిపై దాడి చేశారన్నారు. ఆ సమయంలో తమ్ముడు కర్రెన్న అడ్డురాగా అతన్ని పదునైన కత్తితో చేతిపై పో డవగా తీవ్రంగా గాయపడ్డారన్నారు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తము నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుని భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
హత్య కేసులో నిందితుని అరెస్ట్.
తమ్మున్ని హత్య చేసిన కేసులో ఓబులేసును అరెస్ట్ చేసినట్టు సిఐ వంశీధర్, ఎస్సై వరప్రసాద్ తెలిపారు. నిందితుడు రుద్రవరం అమ్మవారి శాల దగ్గర ఉండగా అతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వారు తెలిపారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక