ఆంధ్రప్రదేశ్
మంత్రాలయం మండలంలో రెండవ రోజు “పల్లె పండుగ” వారోత్సవం

బూదూరు, తిమ్మాపురం, వగరూరు గ్రామాలలో నూతన సీసీ రోడ్లకు భూమి పూజ
మండలంలోని అన్ని గ్రామాలలో సమగ్రాభివృద్ధి సాధిస్తాం ….
మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి
ఏపీ టుడే న్యూస్ (అక్టోబర్,15 )మంత్రాలయం ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను మండలంలోని బూదూరు, తిమ్మాపురం, వగరూరు గ్రామాలలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో శోభారాణి తెలిపారు. మంగళవారం పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి ఎన్ రాఘవేందర్ రెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి వారోత్సవాలకు విచ్చేశారు. వారికి బూదూరు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బూదూరు, తిమ్మాపురం,వగరూరు గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసే సిసి రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బూదూరు గ్రామంలో పూజ అనంతరం రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ…. బూదూరు గ్రామానికి సంబంధించి సిసి రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ప్రభుత్వం నుండి తీసుకువచ్చి బూదూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని,గ్రామపంచాయతీలకు పునర్ వైభవం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ మల్లప్ప, ఈఓఆర్డి ప్రభావతి దేవి, ఉపాధి హామీ పథకం ఏపీవో తిమ్మారెడ్డి, టి ఏ నారాయణరెడ్డి, బూదూరు గ్రామ సర్పంచ్ నాగరాజు ,తెలుగుదేశం పార్టీ నాయకులు జోకన్న రాముడు మర్యాద కాంతప్పా,మర్యాద బోడమ్మ కాంతప్ప,బింగి గోవిందు,మంగలి కాంతప్ప,కరిబిల్లి తాయప్ప,గుడికంటి రాముడు,కొలిమి శాంతప్ప,కరెంటు అబ్రహం,ముక్కరన్న మోసన్న,కొమ్ము దాసప్ప,భూషణం,తలారి రోగప్పా తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక