ఆంధ్రప్రదేశ్
భర్తకు భారమాయే… అత్తమామలకు అక్కర లేకపాయే

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ (అక్టోబర్ 16):
గుడికల్ గ్రామంలో వీధినపడిన గృహిణి…
ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఐక్యవేదిక…
ఓ మహిళ జీవితం కట్టుకున్న భర్తకు భారమైంది. ఆదరించాల్సిన అత్తమామలు ఆ వూసే ఎత్తకపోగా, ముగ్గురు పిల్లల్ని తన రెక్కల కష్టంతో పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్న ఆమెపై అపనిందలు మోపి ఇంటి నుండి బయటకు నెట్టివేసిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లు గ్రామంలో నివాసం ఉండేటువంటి రాజేశ్వరి అను మహిళ కు జరిగింది. బాధ్యతగా ఉండాల్సిన భర్త బజారున తిరుగుతూ ఉండగా, ఆదరించాల్సిన అత్తమామలు అంతకు మరింత భార్య గురించి భర్తకు లేనిపోని అనుమానాలు పెంచి వారి మధ్య గొడవలను సృష్టించి చివరికి ఆమెను కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు నెట్టేసిన అత్తమామలు. ముగ్గురు పిల్లలతో బ్రతుకు భారమై జీవనం సాగించలేకపోతున్నానని బాధితురాలు రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. రాజేశ్వరి ఆవేదన విన్న యస్సీ యస్టి బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆమెకు తోడై నిలిచింది. రాజేశ్వరి ని ఆదరించడానికి తన పుట్టింటి వారు కూడా ఆర్థికంగా బలహీనమైన పరిస్థితిలో ఉండడం కనీసం వారికి కూడా ఉండడానికి సొంత ఇల్లు లేక బాడిగ ఇంట్లో ఉండి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి దీనస్థితిలో ఉన్న పుట్టింటి వారిపై కూడా రాజేశ్వరి ఆధారపడలేని స్థితిలో ఉండడంతో, అలాంటి ఆమెకు మేమున్నామంటూ ముందుకు వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఐక్యవేదిక. రాజేశ్వరిని ఇంతటి దుస్థితికి దిగజార్చిన భర్త అత్తమామలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని బాధితురాలు రాజేశ్వరి కి న్యాయం జరిగేటట్లు చూస్తామని మహిళా నాయకురాలు భారతమ్మ హామీ ఇచ్చారు. అధికారులు చొరవ తీసుకొని రాజేశ్వరికి న్యాయం జరిగేటట్టు చూడాలని ఆమె అధికారులను కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక