ఆంధ్రప్రదేశ్
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు…
ఏపీ టుడే న్యూస్, మహానంది, అక్టోబర్ 24:
-బొలెరో వాహనాల్లో తరలిపోతున్న అటవీ సంపద…
-మితిమీరిపోతున్న అక్రమార్కుల ఆగడాలు…
-మైదానంగా మారుతున్న చలమ అడవి ప్రాంతం…
-నిర్లక్ష్యం నీడన అటవీశాఖ అధికారులు..

నంద్యాల,చలమా రేంజ్ల పరిధిలలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో వెదురు అక్రమ రవాణా దారులకు అడ్డు అదుపే లేకుండా పోతోంది. కొందరు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, అక్రమార్కుల చేతులు కలుపడంతోనే దట్టమైన అడవులు మైదాన ప్రాంతాలుగా మారిపోతున్నాయి. కంచె చేను మేసిన చందంగా అధికారుల తీరు కనిపిస్తోంది.అక్రమ రవాణాను అరికట్టాల్సిన సంబంధిత అటవీ అధికారులు చోద్యం చూస్తూ ఉండటంతో లక్షలు విలువైన సంపదను అక్రమార్కులు దోచుకుంటున్నారు.అటవీ సంపద అక్రమ వ్యాపారులకు మహానంది, చలమ రేంజ్ రాజా మార్గంగా, మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.చలమ రేంజ్ పరిధిలోని నల్లమల అడవి ప్రాంతం నుంచి అటవీ సంపదను బొలెరో వాహనాల్లో, అక్రమంగా తరలిస్తున్న అడ్డుకునే నాధుడే లేడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాతావరణం కలుషితం కాకుండా మానావళిని కాపాడుతున్న పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. యథేచ్ఛగా అటవీ సంపద తరలిస్తున్నారు.చలమ రేంజ్ పరిధిలో నలుదిశలా అడవి విస్తరించి ఉండడంతో, ఏదో ఒక ప్రాంతం నుంచి అటవీ సంపద తరలిస్తూనే ఉంటారు.ఎంతో విలువైన అటవీ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నా, పట్టించుకునే వారే లేరని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారో లేదో కానీ, అటవీ సంపద నరికివేత మాత్రం యథేచ్ఛగా సాగుతోంది.ప్రతి రోజు రాత్రివేళల్లో తెలుగు గంగా కాలువ, మహానంది, బసాపురం తెలుగు కంగా కాలువ,నంద్యాల- గాజులపల్లె జాతీయ రహదారి మార్గాల్లో అటవీ సంపద తరలుతోంది. చీకటి, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేనిపక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. విపరీతంగా అటవీ సంపద నరికివేయడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని, వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంటుందని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు. అడవులు కనుమరుగు అవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చెట్ల నరికివేతను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అడవుల సంరక్షణ అనే కార్యక్రమాలు చేపడుతుంటే, మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా అటవీ సంపద నరుకుతూ అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది.ఇంటి దొంగలే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.అడిగినంత ఇస్తే అడిగే వారే లేరనట్లుగా అధికారుల తీరు మారింది. ఇక్కడ పనిచేసే కొంతమంది అధికారులు అవినీతిలో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.ఈ ప్రాంతంలో జన సంచారం పై పూర్తి గా నిషేధాజ్ఞలు ఉన్న అక్రమార్కులకు ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. యథే చ్ఛగా చలమ రేంజ్ అడవి ప్రాంతంలో చొరబడుతున్న స్మగ్లర్లు అటవి సంపదను కొల్లగొట్టడంతో, పాటు వన్యప్రాణులకు ముప్పును తలపెడుతున్నారు. అయినా జిల్లా ఉన్నతాధికారులు నిస్సాహాయత స్థితిలోనే కనిపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు, అవినీతి అధికారుల ఆగడాలకు అడ్డు లేకుండానే పోతోంది.అవినీతిలో ఆరితేరిన అక్రమార్కుల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడిగినంత ఇస్తే సరే, లేదంటే అక్రమార్కులను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నట్లు చెబుతున్నారు. అందినకాడికి దండుకోవడం అటవీ శాఖ అధికారులకు అలవాటుగానే మారిందంటున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నత అధికారులు, అటవీ సంపద అక్రమార్కులపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68084