ఆంధ్రప్రదేశ్
అమరావతి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్*

అమరావతి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఏపీ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,245 కోట్లతో రాజధాని అమరావతికి నూతన రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 57 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం చేపడతామన్నారు. ఈ రైల్వే లైన్ కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఏర్పాటు కానుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులభం కానుంది. అమరావతి స్థూపం, ధ్యాన బుద్ధ ప్రాజెక్టు, ఉండవల్లి గుహలు, అమర లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేవారికి అనువైన మార్గంగా మారనుంది.
6 లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు
రైల్వే లైన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లను కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులిచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించారు.
చామకూర వీరప్ప
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్
నంద్యాల జిల్లా
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక