Uncategorized
కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన …కర్నూలు పోలీసులు.

కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీ లో ఏకకాలంలో దాడులు.
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పి జె. బాబు ప్రసాద్ పర్యవేక్షణలో సోమవారం తెల్లవారుజామున కర్నూలు నాల్గవ పట్టణ సిఐ మధుసుధన్ గౌడ్ ఆధ్వర్యంలో కర్నూల్ వీకర్ సెక్షన్ కాలనీ లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.6 మంది సిఐలు, 5 మంది ఎస్సైలు, 75 మంది పోలీసులు పాల్గొన్నారు.రౌడీషీటర్లు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనుమానితుల ఇళ్ళల్లో దాడులు నిర్వహించారు.వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.మంచి ప్రవర్తనతో మెలగాలని తెలియజేశారు.
ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే అటువంటి వారి సమాచారాన్ని అందించండి. తగిన పారితోషికం ఇస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు తెలిపారు.కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలో ఎలాంటి ధ్రువ పత్రాలు లేని 15 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిఐలు మధుసూధన్ గౌడ్, ప్రవీణ్ కుమార్, నాగరాజరావు, పవన్ కుమార్, పార్థసారథి రెడ్డి, ఎస్సైలు , పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక