Connect with us

Uncategorized

వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలి.

Published

on

వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలి.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి.

నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

కర్నూలు జిల్లాలో ఉండే కార్పొరేట్
ప్రవేటు పాఠశాలలో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీని అందించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.గోరంట్లప్ప, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు హుసేన్, జిల్లా కన్వీనర్ నాగేంద్ర నగర కార్యదర్శి శివకుమార్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కు సోమవారం వినతిని అందించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో చాలా జిల్లాలో జిల్లా కలెక్టర్ల ఆదేశానుసారం 50 శాతం రాయితీ అందిస్తున్నారని కర్నూలు జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు అందించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ )ఆధ్వర్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి వినతిని అందిస్తున్నామన్నారు.దాదాపు అన్ని జిల్లాలో 50 శాతం రాయితీ అందించేలా కలెక్టర్లు డిఇఓ లకు అదేశాలు ఇచ్చారన్నారు.పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ ,చిత్తూరు, కాకినాడ ,ప్రకాశం,జిల్లాలో ఇప్పటికె 50 శాతం ఫీజు రాయితీ అందిస్తూ ఆదేశించారన్నారు.అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఉండే వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ అందించేలా తమరు చర్యలు తీసుకోవాలని విద్య శాఖ అధికారులకు ఆదేశించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ గా విజ్ఞప్తి చేశామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ తగినచర్యలు తీసుకునేలా సమాచార శాఖ డి.డి.జయమ్మకు రెఫర్ చేస్తూ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి సునీల్ కుమార్, నాయకులు బ్రహ్మయ్య, శివ శంకర్, ఎర్రమల,దామోదర్,సుందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580179
Total Users : 47863