ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో దస్తగిరి స్వామి గార్మి పండుగ .. -2 వేల మంది భక్తులకు అన్నదానం ..

ఏపీ టుడే న్యూస్, కడప జిల్లా,
జమ్మలమడుగు: నవంబర్01:
దస్తగిరి స్వామి గార్వి షరీఫ్ పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు పట్టణంలోని మిఠాయిగిరి వీధిలో ఉన్న పురాతన దస్తగిరి స్వామి దర్గాలో మిఠాయిగిరి వీధికి చెందిన ముస్లిం పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు అందరూ కలిసి కట్టుగా దస్తగిరి స్వామి పెద్ద జండాలను పట్టణంలోని పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఎంతో భక్తిశ్రద్ధలతో దస్తగిరి స్వామి గార్మి పండుగ నిర్వహించారు. ఈ గ్యార్మి పండుగలో జామియా మసీద్ పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి మరియు గురువులు సయ్యద్‌షా గౌస్ పాషా ఖాద్రి, మోసిన్ పాషాఖాద్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా పీఠాధిపతి దస్తగిరి స్వామి దర్గాలో జెండాలను ఆవిష్కరించి అనంతరం దస్తగిరి స్వామి వారికి ప్రత్యేక ఫాతేహా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి దస్తగిరి స్వామి మహిమల గురించి భక్తులకు వివరించారు. భక్తితో దస్తగిరి స్వామి ని కొలిచి ఎలాంటి కోరికలు కోరుకున్న వారి కోరికలు కచ్చితంగా తీరుతాయని ప్రజల నమ్మకం అని తెలిపారు. అంతేకాకుండా దస్తగిరి స్వామిని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కొలుస్తారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా దస్తగిరి స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించ బడతాయనితెలిపారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గార్మి పండుగలో పాల్గొన్న దాదాపు 2000 మందికి పైగా భక్తులకు దర్గా కమిటీ వారు అన్నదానం నిర్వహించారు. పండుగలో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు, తాము జీవిత కాలంలో చేసినతప్పులు మన్నించి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలుప్రసాదించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గురువులు గౌస్ పాషా ఖాద్రీ, మోసిన్ పాష ఖాద్రి, వేలాది సంఖ్యలోముస్లిం సోదర సోదరీమణులు వందలాది సంఖ్యలో పాల్గొన్నారు.
దస్తగిరి స్వామి దర్గాలో ప్రత్యేక ఫాతిహా నిర్వహిస్తున్న పీఠాధిపతి,
02: దస్తగిరి స్వామి పండుగలో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు
03: దర్గా వద్ద దస్తగిరి స్వామి జెండాలతో చిన్నారుల కేరింతలు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక