Uncategorized
ఉద్యోగాలు పేరుతో టోకరా కొట్టిన హైదరాబాద్ కన్సల్టేన్సీ విఖ్యాత్ అసోసియేట్స్,ఇతర సంస్థలు

లక్షల్లో మోసపోయిన బాధితులు
మధ్యవర్తిపై దాడులకు ప్రయత్నం
ఎస్పీని ఆశ్రయించిన మధ్యవర్తి
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కర్నూలు నగరంలో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ విఖ్యాత్ కన్సల్టేన్సీ టోకరా కొట్టి బాధితులను లక్షల్లో దోపిడీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి.కర్నూలు,దిన్నెదేవర పాడు, వెంకటాద్రినగర్ కు కత్తిపెద్ద మద్దిలేటి (మధు) అనే వ్యక్తి హైదరాబాద్ లో విఖ్యాత్ అసోసియేట్స్ ప్రైవేట్ కన్సల్టేన్సీ ఏర్పాటుచేసుకున్నాడు.ఇందులో భాగంగా ఉద్యోగాలు కల్పిస్తామని క్యాంపస్ మార్గ్, ఫ్లాగ్ షిప్ కొలాబరేషన్ – మనేష్,అనార్గ్య కమ్యూనికేషన్స్ – సంజన,రైజ్ టెక్ సాఫ్ట్ – పి. అశోక్ రెడ్డి,యొట్ట టెక్నాలజీస్ అండ్ ఆరాఫ్ ఐటి – సామెల్, సిఎంఐటి – ఢిల్లేశ్వర్ రావు వంటి ఫేక్ కంపెనీలతో సంబంధాలు కొనసాగించడం,ఎం.ఎన్.సి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని కర్నూలు నగరంలోని జశ్వర్ధన్ రాజ్ అనే కన్సల్టేన్సీని నమ్మించాడు.దీంతో జశ్వర్ధన్ రాజ్ నిరుద్యోగులు ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూళ్లు చేసి తన స్వంత ఖర్చులకు కొంత డబ్బులు వాడుకుని,మరింత డబ్బులు కంపెనీలకు చెల్లించాడు.ఈ నేపథ్యంలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించి,వారికీ 3-4 నెలలు జీతాలు చెల్లించడం జరిగింది. ఆ తరువాత కంపెనీలు మూతవేసి బోర్డు తిప్పేశారు.దీంతో మోసపోయిన బాధితులు
ఫేక్ కంపెనీల యజమానులను నిలదీయడం తో బాధితులను రెచ్చగొట్టి ఎవరికైతే డబ్బులు చెల్లించారో వారిని అడగండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.చివరకు బాధితులు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి ఇంటికి వద్ద కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేయడం,జశ్వర్ధన్ రాజ్ పై దాడి చేసినట్లు మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆందోళన చెందారు.ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ కు పిర్యాదు చేసినట్లు చెప్పారు.కావున అధికారులు చొరవ చూపి బాధితులకు న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక