Uncategorized
కంటి వైద్యానికి కేరాఫ్ గా నిలుస్తున్న సుశీల నేత్రాలయ

రాయలసీమ జిల్లాలో నే మొట్ట మొదటిసారిగా గ్లాకోమా వాల్వ్ సర్జరీ అంధకారం కాకుండా చూపు కాపాడిన వైద్యులు.
సుశీల నేత్రాలయ సిఇఓ డాక్టర్ సుధాకర్ రావు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
రాయలసీమ జిల్లాలో కంటి వైద్యానికి కేరాఫ్ గా సుశీల నేత్రాలయ హాస్పిటల్ నిలుస్తుంది.
కంటికి సంబంధించిన అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ ఎంతో మందికి చూపును నిలుపుతున్నారు. రాయలసీమ జిల్లాలోనే మొట్ట మొదటి సారిగా గ్లాకోమా వాల్వ్ సర్జరీనిసోమవారంవిజయవంతంగా నిర్వహించారు. ఈ సర్జరీ చేసిన డాక్టర్స్ విజయ, డాక్టర్ ఈశ్వర్, డాక్టర్ సావిత్రి సుధాకర్ డాక్టర్ నేహా సుధాకర్, డాక్టర్ నేహా గోష్ లతో సుశీల నేత్రాలయ హాస్పిటల్స్ సిఇఓ డాక్టర్ సుధాకర్ రావు మంగళవారం హాస్పిటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఇఓ డాక్టర్ సుధాకర్ రావుమాట్లాడుతూ కంటికి వచ్చే గ్లాకోమా అనే వ్యాధి వల్లచాలామందిచూపుకోల్పోతున్నారు.అలాంటి సంఘటననే గుంతకల్లు కు చెందిన రిటైర్డ్ అట్టెండర్ గోవిందప్ప కు ముందు నుండి కుడి కన్ను కనిపించదు. ఎడమ కన్ను నల్లగా మారిపోయి చూపు మందగించింది. రెండు సంవత్సరాలుగాఇబ్బందిపడుతున్నారు. ఆయనకు నల్లగుడ్డు ముసుకుపోవడం వల్ల కార్నియా కాన్సివేటర్ సర్జరీ చేశాము.కాస్త చూపు వచ్చాక అదే కంటికి గ్లాకోమా వచ్చింది. గ్లాకోమా అనే వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి అలాంటి గ్లాకోమా వల్ల కంటి చూపుమెల్లగాకోల్పోతున్నారు.అందుకుగానుఉన్నచూపునునిలబెట్టాలని ఆయనకు ఉన్న ఒక కన్ను కనిపించకుంటే రెండు కళ్ళు అంధకారం అవుతాయని అహ్మద్ గ్లాకోమా వాల్వ్ అనే పరికరం ఏర్పాటు చేసి డాక్టర్ విజయ ఆధ్వర్యంలో సోమవారం సర్జరీ నిర్వహించి విజయవంతం చేశారు. ఆయనకు ఉన్న చూపును కోల్పోకుండా కాపాడారు. ఈ సర్జరీని రాయలసీమ జిల్లాలోనే మొదటిసారిగా సుశీల నేత్రాలయ లో నిర్వహించడం గర్వకారణం అన్నారు.ప్రస్తుతానికి గోవిందప్ప చూపు బాగుందని ఇంకా మెరుగైన చూపు వస్తుందని తెలిపారు. కంటికి సంబంధించిన అత్యాధునిక వైద్యాన్ని సుశీల నేత్రాలయంలో అందిస్తున్నామనికంటికిసంబంధించిన సమస్యలతో బాధ పడకుండా ఉండాలని తెలిపారు. అనంతరం పేషేంట్ గోవిందప్ప మాట్లాడుతూ కంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డానని ఎక్కడ చూపించిన ప్రయోజనం లేక సుశీల నేత్రాలయంలో జాయిన్అయ్యానని తెలిపారు. డాక్టర్స్ చాలా మంచి వైద్యాన్ని అందించారని నాకు మంచిగాచూపుప్రసాదించారన్నారుఈ కార్యక్రమంలో డాక్టర్స్, సుశీల నేత్రాలయ హాస్పిటల్ సిబ్బంది పేషేంట్ బంధువులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక