ఆంధ్రప్రదేశ్
కర్నూలు మునిసిపల్ టౌన్ ప్లాన్ అధికారులపై చర్యలు తీసుకోండి.

రాయలసీమ యువజన పోరాట సమితి నాయకులు జాయింట్ కలెక్టర్ వినతి.*l
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
రాయలసీమ యువజన పోరాట సమితి నాయకలు వి.వి.నాయుడు, ఎ. రామిరెడ్డి లు మాట్లాడుతూ కల్లూరు గ్రామ రెవెన్యూలోని విఠల్ నగర్ లో అగ్రసేని రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత బి.కె.సింగ్ తిరుమల గిరి వెంచర్ పేరుతో ల్యాండ్ కన్వర్షన్ లేకుండా, ఎటువంటి వెంచర్ అప్రువల్స్ లేకుండా హంద్రీనది భూమి మరియు దేవాదాయ భూములలో అక్రమంగా నిర్మాణాలు చేస్తే ఆ అక్రమ నిర్మాణాలకు కర్నూలు మునిసిపల్ టౌన్ ప్లాన్ అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. బఫర్ జోన్ 50 మీటర్లు దూరం కాకుండా ఏకంగా హంద్రీనదిలోని సర్వేనెంబర్: 470Bలో అక్రమ నిర్మాణాలకు పొజిషన్ కు సంబంధం లేని ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు టౌన్ ప్లాన్ అధికారులు అప్రువల్స్ ఇవ్వడం అధికారుల అక్రమాలకు పరాకాష్ఠ అన్నారు. ఈ వెంచర్ లో 91 ఇండ్లు నిర్మాణం చేయగా హంద్రీనదిలో 16 ఇండ్లు, బఫర్ జోన్ లో 46 ఇండ్లు నిర్మాణం చేసారన్నారు. హంద్రీనదిలోని అక్రమ నిర్మాణాలు గత కలెక్టర్ పడగొట్టమని ఆర్డర్ ఇచ్చి ఏడాదిన్నర దాటినా చర్యలు తీసుకోకపోవడం మానేసి పెద్ద మొత్తాలలో లంచాలు తీసుకొని నిర్మణాలకు అప్రువల్స్ ఇవ్వడం దుర్మార్గమైన చర్యా అని అన్నారు. పైగా హైకోర్టులో కేసు ఉంది అని పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. స్టే కోసం బిల్డర్ రెండు సార్లు హైకోర్టు ను సంప్రదించగా కోర్టు ఎటువంటి స్టే ఇవ్వకుండా కేసును డిస్పోస్డ్ చేసి చర్యలపై అధికారులకే అప్పజెప్పిందన్నారు. హంద్రీనది మరియు బఫర్ జోన్ లో నిర్మణాలు కర్నూలు నగర ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్నారు. కావున నదులు,వాగులు,దేవాలయ భూములు,వక్ఫ్ భూములతో వ్యాపారం చేస్తున్న అగ్రసేని బిల్డర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి సహకరిస్తున్న అధికాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జె.సి. స్పందిస్తూ మునిసిపల్ కమీషనర్ చెప్తూ త్వరగా చర్యలు తీసుకోండి అని చెప్పారన్నారు. చర్యలు జరిగేవరకు ఆందోళనలు ఆపమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.వసంత్, విజయ్ , మధు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక