ఆంధ్రప్రదేశ్
నల్లమల్లలో దారి తప్పిన భక్తులు
ఏపీ టుడే న్యూస్ శ్రీశైలం



నల్లమల అడవిలో భక్తులు చిక్కుకున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం కు చెందిన 15మంది భక్తులు శ్రీశైలం యాత్రకు వచ్చారు. వీరంతా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల ను దర్శించుకున్నారు.అనంతరం శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి వెళ్తూ నల్లమల అడవిలో దారి తప్పారు. కొంత సేపటికి ఫోన్ సిగ్నల్ ప్రదేశానికి చేరుకుని డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సహకారంతో అడవిల్లో చిక్కుకున్న భక్తుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని,బిక్కు బిక్కుమంటూ భక్తులు నా నా అగచాట్లు పడ్డారు. మరో వైపు ఏ ఆడవి జంతువు దాడి చేస్తాదో, తెలియక ప్రాణ భయంతో గడిపారు. అసలే చలి కాలం కావడంతో, చలికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలికి తట్టుకోలేక అడవిలో మంట వేసుకొని సేద తీరారు. ఎట్టకేలకు నల్లమల అడవిలో దారి తప్పిన భక్తుల ఆచూకీ కనుక్కొని వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68087