ఆంధ్రప్రదేశ్
ప్రముఖ వైద్యులు డాక్టర్ జి. సమరం నేతృత్వంలో ఈనెల 4, 5 తేదీలలో విజయవాడలోని నాస్తిక కేంద్రంలో ప్రపంచనాస్తిక మహాసభలు ఘనంగా జరిగాయి.
విజయవాడ ఏపీ టుడే న్యూస్ జనవరి 5,ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంపై లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్. జయ ప్రకాష్ నారాయణ ఐఏఎస్ రిటైర్డ్ అధ్యక్షతన జరిగిన చర్చా గోష్టి కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కుబేరుల మధ్య పోటీగా కొనసాగుతుందని, ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కులాల వారీగా విభజించారని, రాష్ట్రంలో నెలకొని ఉన్న నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, అసమానతలపై దృష్టి సారించకుండా పాలన కొనసాగుతుందని, చట్ట సభలకు ఎన్నికైన వారు అవినీతిపరులుగా మారి వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితులలో సమాజం గురించి ఆలోచించే సేవా తత్పరులు, మానవతావాదులు, ప్రజాస్వామ్య వాదులతో బలమైన ప్రత్యామ్నాయ శక్తి ఉద్భవించాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రపంచ భూభాగంలో 2.4 శాతం మాత్రమే ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో 18 శాతంగా ఉన్న వాస్తవాన్ని తెలుపుతూ ప్రపంచ జనాభాలో భారత్ అగ్రగామిగా ప్రథమ స్థానానికి చేరిందని, ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది అదనంగా భారత్ లో చేరుతున్న సందర్భంలో కొంతమంది రాజకీయనేతలు, మతోన్మాదులు ఇంకా పిల్లలను కనండి అంటూ పదే పదే ఉద్బోధిస్తున్నారని విమర్శించారు.
దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ లాంటి దేశాలతో భారతదేశాన్ని పోల్చకూడదని డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేర్కొంటూ భారత దేశంలో జనాభా నియంత్రణను కొనసాగించాలన్నారు.
దేశవ్యాప్తంగా 250 మంది ప్రతినిధులు నాస్తిక మహాసభలకు హాజరై అనేక సామాజిక అంశాలపై అవగాహన పెంచుకున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68060