ఆంధ్రప్రదేశ్
పామూరు లో స్వామి వివేకానంద జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన బిజెపి నేతలు
ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 12
పామూరు స్థానిక బిజెపి కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల బిజెపి అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి శ్రీను అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కనిగిరి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కొండశెట్టి వెంకట రమణయ్య పాల్గొని వారి విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రకఠోరమైన సంకల్పం కలిగిన యువకులు ఈ భారతదేశ తలరాతని మార్చగలరని విశ్వసించన వ్యక్తి, ఆధాత్మిక గురువు స్వామి వివేకానంద అని కొనియాడారు. రామకృష్ణ పరమహంస మఠం స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు,ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించారని,అతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1984 ఆయన జన్మదినాన్ని “*జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది. అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పెరమన విజయ్ కుమార్ చారి, చింతపూడి మల్లికార్జున, బొంతల హజరత్ కుమార్, దేవిశెట్టి పవన్, పాడే అరవింద్, సింగరాజు శివకృష్ణ, ద్రోణాదుల చరణ్, పాతపాటి పవన్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68078