ఆంధ్రప్రదేశ్
త్వరలో అన్ని మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్లు..! జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, ఏపీ టుడే ఆగస్టు 20 : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్.. 90 రోజుల్లోనే జిల్లాలోని అన్ని మండలాల్లో అమలులోకి రానున్నామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్ గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల ప్రణాళిక, డిజైన్ల గురించి జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.. జేసీ అదితిసింగ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వారు రూపొందించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవనాల నిర్మాణాల డిజైన్లను పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నూతనంగా రూపుదిద్దుకోనున్న స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణాలు అన్ని మండలాల్లో ఒకే డిజైన్ తో ఉండాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే.. కడప నగరంలో నిర్వహణలో ఉన్న స్మార్ట్ కిచెన్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని మండలాల్లో స్మార్ట్ కిచెన్ షెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని.. మరింత శుచిగా, రుచికరంగా, తాజాగా విద్యార్థులకు అందించే లక్ధ్యంగా ప్రతి మండలంలో ఒక ప్రధాన పాఠశాలలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ షెడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి 60 రోజుల్లో సివిల్ వర్క్ పూర్తి చేసి, మరో 15 రోజుల్లో అన్ని రకాల పరికారాలను ఏర్పాటు చేసి ట్రయిల్ రన్ నిర్వహించాలన్నారు. ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోపే పూర్తి చేసి.. కిచెన్ షెడ్లను నిర్వహణలోకి తీసుకురావాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సీపీవో హజరతయ్య, డీఈవో శంశుద్దిన్, డ్వామా పీడి ఆదిశేషారెడ్డి, హౌసింగ్ పీడి రాజా రత్నం, ఎడిపి యంగ్ ప్రొఫెషనల్స్, ఎస్ఎస్ఏ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక