ఆంధ్రప్రదేశ్
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
కడప జిల్లా/జమ్మలమడుగు ఎపీ టుడే న్యూస్ మార్చి 27

మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఉచిత కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనం నందు బీసీ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలను లక్షాధికారులుగా చేయాలనే ఉద్దేశంతోనే మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటిని ఉపయోగించుకుని మహిళలు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. అనంతరం టిడిపి ఇంచార్జ్ భూపేష్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలు మగవారికి ఏమాత్రం తక్కువ కాదని అన్ని రంగాల్లో మహిళలు కూడా తమ ప్రతిభా పాటవాలు చాటి చెప్పి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, ఎంపీడీవో సయ్యద్ ఉన్నిసా, ఎన్డీఏ కూటమి నాయకులు గోనా పురుషోత్తం రెడ్డి, టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక
-
ఆంధ్రప్రదేశ్1 year ago
స్పందన సుబ్బరామిరెడ్డి ఇకలేరు…





Total Users : 87378