ఆంధ్రప్రదేశ్
ఘనంగా వంగవీటి మోహనరంగా జయంతి
పేదలపెన్నిధి వంగవీటి మోహనరంగా
త్వరలో వంగవీటి విగ్రహ ఏర్పాటు
– అరణి శ్రీనివాసులు
– తిరుపతి ఎమ్మెల్యే
ఈరోజు ఉదయం 11గంటలకు తిరుపతి అనంత వీధి కూడలి నందు రాధారంగా మిత్రమండలి మరియు బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు విచ్చేసారు. ముందుగా వంగవీటి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి భారీ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం 500 మందికి అన్నదానం చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా గారు అని, నిస్వార్థ ప్రజాసేవకుడని తెలియజేసారు. అలాంటి వ్యక్తి పేదల కోసం తనువు చాలించారని అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తరువాత తెలుగుదేశం నాయకులు ఊక విజయకుమార్ మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదానికి తార్కాణం వంగవీటి మోహనరంగా గారు అని పేర్కొన్నారు. తరువాత రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన చేతుల ద్వారా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సంవత్సరం తిరుపతి చరిత్రలోనే అత్యథిక మెజారిటీ తో గెలుపొందిన మా నాయకులు అరణి శ్రీనివాసులుగారు అతిధిగా రావడం ఆనందంగా ఉందని అంతేకాక గత ప్రభుత్వంలో ఎన్నో ఏళ్లుగా రంగా గారి విగ్రహ ఏర్పాటుకు ప్రత్నించామని వైస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం అరణి శ్రీనివాసులు గారు త్వరలో తప్పక విగ్రహ ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అరణి శ్రీనివాసులు గారు,ఊక విజయకుమార్ గారు, ఆర్కాట్ కృష్ణప్రసాద్, బెల్లం కొండ సురేష్ , నీలాద్రి , ఆముదాల తులసీరామ్ , షేక్ మౌలా , వెంకట కృష్ణ , సుబ్బా, అంజి బాబు , ఆర్కాట్ సాయి , తోట జయంతి, కోకిల, ఆళ్వార్ మురళి , కూరగాయల ప్రసాద్ , గోపి రాయల్, అవిశెట్టి ప్రభాకర్ , శెట్టిపల్లి చరణ్ , వంశి , రమేష్ ,తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392