తెలంగాణ
బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్ హ్యాక్ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!

హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది.
అక్కడ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది.
ఈ కంపెనీలో ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారి లావాదేవీలు ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంటాయి.
ఇలా ఆన్లైన్లో డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్‌సైన్సెస్ సంస్థ చూస్తుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది మే 11న లైఫ్‌సైన్సెస్ సంస్థ పేరిట సదరు ఫార్మా కంపెనీకి ఓ మెయిల్ వచ్చింది.
తమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని, కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే రెండు బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది ఆ మెయిల్ సారాంశం.
ఈ మెయిల్ తమ కంపెనీ లావాదేవీలు చూస్తున్న లైఫ్‌సైన్సెస్ సంస్థ పంపించిందని భావించిన కంపెనీ నిర్వాహకులు..
మెయిల్లో సూచించిన ఖాతాలకు 13,67,195 అమెరికన్ డాలర్లను పంపించారు.
అయితే అదే నెల 16వ తేదీన ముడిసరకు సరఫరాదారులకు తమకు ఇంకా పేమెంట్ అందలేదంటూ లైఫ్‌సైన్సెస్ సంస్థ నుంచి ఫార్మా కంపెనీకి ఫోన్ వచ్చింది.
మెయిల్లో అకౌంట్లు మారాయని, వేరే అకౌంట్ నంబర్లు మీరే ఇచ్చారని, అలా ఇచ్చిన రెండు బ్యాంకు ఖాతాలకు ఐదు రోజుల క్రితమే డబ్బులు పంపించామని కంపెనీ ప్రతినిధులు బదులిచ్చారు.
ఇక్కడే అసలు విషయం బయటపడి ఖంగుతిన్నారు. తాము అసలు ఎలాంటి మెయిల్ పంపలేదని లైఫ్‌సైన్సెస్ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో ఫార్మా కంపెనీ ప్రతినిధులకు దిమ్మతిరిగింది.
ఇదంతా సైబర్ హ్యాకర్లు చేసిన పని అని తెలుసుకున్న కంపెనీ చేసేదిలేక పోలీసులను ఆశ్రయించారు.
తప్పుడు మెయిల్ పంపించి ఏకంగా రూ.11.4 కోట్లు తస్కరించినట్లు గుర్తించిన ఫార్మా కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)కు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక