ఆంధ్రప్రదేశ్
మడికి నుండి చొప్పెల్ల వరకు జాతీయ రహదారి వెంబడి సర్వీస్ రోడ్ ను ఏర్పాటు చేయండి-నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇంచార్జ్ గుర్రపు కొత్తియ్య
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక నుండి మడికి వరకు జాతీయ రహదారికి సమాంతరంగా సర్వీస్ రోడ్డు నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య డిమాండ్ చేశారు. దివాన్ చెరువు వద్ద గల జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయంలో పిడి డి. సురేందర్ నాథ్ కు వినతిపత్రం అందజేశారు. 216 (ఏ)వ నెంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలోనే చెముడులంక వద్ద ఎస్టిఎస్ఎన్ఎం ప్రభుత్వ పాఠశాలతో పాటు ఓ ప్రైవేట్ కళాశాల, మడికి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ ఉన్నాయని, హైవే వెంబడి గ్రామాలు ఉండడంతో జాతీయ రహదారిపై ప్రజలు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారని అన్నారు. సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయడం వలన రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని పిడికి తెలియజేశారు. అలాగే గోదావరి లంకల మధ్యలో బడుగువానిలంక గ్రామం ఉండడంతో ఆ గ్రామ ప్రజలు రావులపాలెం, రాజమండ్రి వెళ్లేందుకు రోడ్డు దాటుతూ అనేకమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని చెముడులంక సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఓపెన్ ఏర్పాటు చేయాలంటూ పలు సమస్యలపై కొత్తియ్య హైవే అధికారులకు వివరించారు. దీనిపై హైవే అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సెక్రటరీ నెల్లి మహేష్, కొత్తపేట మండల ఉపాధ్యక్షుడు విజ్ఞేశ్వరపు ముసింద్ర తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456