ఆంధ్రప్రదేశ్
డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేద్దాం : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. బుధవారం ఆలమూరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి నరసింహ స్వామి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది వాడపాలెంలో బండారు సత్యానందరావును కలిసి కళాశాల స్థితిగతులను వివరించారు. ప్రస్తుతం డిగ్రీ అడ్మిషన్లలో మొదటి విడతలో బీకాం 10 మంది విద్యార్థులు బీఏ 10 మంది విద్యార్థులు బీఎస్సీలో నలుగురు విద్యార్థులు చేరడం జరిగిందని వారందరికీ మొదటి సంవత్సరం ఫీజు చారిటబుల్ ట్రస్ట్ భరిస్తుందని ఇంకా రెండు మూడు విడతల అడ్మిషన్లు ఉన్నాయని కళాశాల అధ్యాపక బృందం ఎమ్మెల్యేకు వివరించారు. జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల పక్కా భవనాలు నిర్మించడంతో పాటు కళాశాల అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా అందిస్తానని, ఆలమూరు పరిసర ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని,అందరూ కలిసి కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని బండారు సత్యానందరావు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87462