ఆంధ్రప్రదేశ్
కలవచర్లలో ఉప్పొంగిన ఉత్సాహం : ఎన్డిఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు.
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కొత్తపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు చరిత్ర మరువని అఖండ విజయాలతో సంచలనం సృష్టించిన సందర్భంగా, ఆలమూరు మండలం కలవచర్ల ఎన్డిఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సలాది నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముందుగా పాపారావు, నాగేశ్వరరావులకు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాపారావు నాగేశ్వరరావులను పూలమాలలతో పుష్పగుచ్చాలతో ముంచేత్తారు. సాలువలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ వారు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, ఆడపడుచులకు, పేరుపేరునా పాపారావు, నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం బండారు సత్యానందరావు సారథ్యంలో అభివృద్ధిలో దూసుకుపోతాయన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కలవచర్ల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87464