ఆంధ్రప్రదేశ్
బుర్రిలంక జాతీయ రహదారి పై పొంచివున్న ప్రమాదం ముప్పు రావులపాలెం నుండి రాజమండ్రి వెళ్ళే వాహన దారులకు జాగ్రత్త
తూర్పుగోదారిజిల్లా
కడియం మండలం
బుర్రిలంక జాతీయ రహదారి పై పొంచివున్న ప్రమాదం
చిన్నపాటి వర్షానికే ముంపుకు గురవుతున్న రోడ్డు
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహన దారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంది.ఎందుకంటే చిన్ని పాటి వర్షం వచ్చినప్పటికీ ఈ రహదారి ముంపు గురవుతుంది. రావులపాలెం నుంచి రాజమండ్రి వైపుకు వేగంగా వచ్చే వాహనదారులు ఈ నీటిలో చిక్కుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆంజనేయస్వామి విగ్రహం నుంచి బుర్రిలంక వంతెన దగ్గరికి పెద్ద మలుపు ఉంటుంది. ఈ రహదారి వర్షపు నీటితో మునిగి ఉంటుంది. అదే వేగంతో వస్తే అదుపుతప్పి ప్రమాదబారిన పడుతున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. నిత్యం ఈ రహదారిపై వేలాది వాహనాలు వెళుతుంటాయి. ఈ సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా నేషనల్ హైవే నిర్వహణా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ ముంపునీటి బారిన పడి క్షతగాత్రులుగా మారారు. అందువల్ల ఇటువైపు వెళ్లే వాహనదారులు ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నతాధికారుల కూడా దీనిపై తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87462